Self Motivation in Telugu : స్వీయ ప్రేరణయే సక్సెస్ కి మార్గం. ఆచరణలో పెడితే అన్ని అద్భుతాలే…!

Self Motivation in Telugu : స్వీయ ప్రేరణయే సక్సెస్ కి మార్గం. ఆచరణలో పెడితే అన్ని అద్భుతాలే…!

Self Motivation in Telugu : ఎవరైనా ఒక మనిషి ఏదైనా ఒక పనిలో విజయం సాధించడం వెనక అనేక కారణాలతో పాటు కొన్ని ప్రేరణలు ఉంటాయి. చదివిన చదువుకు చేస్తున్న పనికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మరియు సామాజిక సంబంధాలు ఆర్థిక వనరులు ఇవన్నీ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయని, పెద్దలు చెప్తూ ఉంటారు. నిరాశలో మీరు కోలుకోలేని పరిస్థితిలో, మీ ఆశల తీరానికి చేర్చే నావ లాంటిదే ఈ సెల్ఫ్ మోటివేషన్. అపజయాలు కలిగిన చోటే విజయానికి శ్రీకారం చుట్టడంతో మీకు మీరే ప్రేరణ పొందడంలో ఇది కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పాలి.

Self Motivation : నిజానికి మనుషులు అనేక విషయాల్లో పరస్పర ఆధారిత జీవులు అని చెప్పాలి. కాబట్టి సొంత నిర్ణయాలు అంత ఎఫెక్ట్ గా ఉండాలని కూడా అనిపించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అవే పని చేస్తాయి. అలాంటిదే ఈ సెల్ఫ్ మోటివేషన్ అంటున్నారు కొంతమంది నిపుణులు. దైనందిక జీవితంలో అనేక సమస్యల నుంచి , నిరాశ నిస్పృహల నుంచి, బాధలు, భావోద్వేగాల నుంచి రియలైజ్ అవ్వడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది స్వీయ ప్రేరణే.

మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంతో పాటు విజయం వైపు కూడా నడిపిస్తుంది. అందుకే సమస్యల సుడిగుండాలు మిమ్మల్ని చుట్టముట్టినప్పుడు మీకు మీరే ధైర్యంగా నిలవాలి. మీకు మీరే ధైర్యం ని కూడా చెప్పుకోవాలి. కష్టాల నుంచి బయటపడే మార్గం ఏంటని ఇతరులను అడగవచ్చు. నలుగురి అభిప్రాయాలను కూడా తీసుకోవచ్చు. కానీ చివరిగా మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోకపోతే ఇవన్నీ ఏవి పనిచేయవు. కాబట్టి నిజాలను విశ్లేషిస్తూ మిమ్మల్ని మీరు మార్చుకోండి లక్ష్యం సాధించే దిశగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. అంటున్నారు కొందరి నిపుణులు.

Self Motivation in Telugu :జీవితంలో విజయం మాత్రమే శాశ్వతం కాదు. నిజానికి అది వైఫల్యాల పునాదుల మీద నిర్మించుకుంటేనే మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేకుంటే మభ్యంతరంగానే కుప్పకూలిపోతుంది. కాబట్టి చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటే నిరాశ చెందకండి. ఎందుకంటే ఆ నిరాశ మిమ్మల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. అలాగే ఓటమి గురించి భయపడుతూ కూర్చోకండి. వాటికి గల కారణాలను విశ్లేషించుకోండి.

జీవితంలో మీకు వచ్చిన మంచి అవకాశం గా భావించండి. నిజానికి సక్సెస్ ఆల్రెడీ అనుభవిస్తున్న వారి కంటే ఓటమి బాధను అనుభవిస్తున్న వారికి చాలా విషయాలు తెలిస్తే తెలుస్తాయని అంటుంటారు. మరోసారి ఓడిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వీరు తీసుకునే నిర్ణయాలు సరైనవుగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే వారు గుణపాఠం నేర్చుకొని ఉంటారని, ఓటమి అన్ని వీరికి నేర్పిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఏ సందర్భంలో కూడా నిరాశను, తాత్కాలిక ఒడిదుడుకులను వైఫల్యంగా భావించి, విచారిస్తూ కూర్చోవద్దు. వాటిని సక్సెస్ సాధించడానికి మంచి గుణపాటాలుగా స్వీకరిస్తే అదే మీ సెల్ఫ్ మోటివేషన్ కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.

Self Motivation in Telugu :మీ ఆలోచనలు ఏవైనా కావచ్చు. వాటిలో స్పష్టత చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. బయటి వ్యక్తులు తరచుగా నీతులు చెప్పినంత మాత్రాన మీలో మార్పు రాదు. ముందు మీలో కూడా ఆ చిత్తశుద్ధి ఉండాలి. అందుకు అనుగుణంగా మీ ఆలోచనలను మార్చుకోవాలి. అందుకోసం ఏ మానసిక నిపుణులు అవసరం లేదు. మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు? ఇలా మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అప్పుడు వాటిని ఓ కాగితంపై రాయండి. సమాధానం కూడా మీ బుర్రలోనే ఉంటుంది. కాస్త ఆలోచించి దానిని కూడా రాయండి. సరైన మార్గంలో ఎలా వెళ్లాలో అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇదే స్వీయ ప్రేరణ. అప్పటిదాకా ఉన్న ప్రతికూల ఆలోచనలు పోగొట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో మీకు ధైర్యం వస్తుంది.

Self Motivation in Telugu :ఏదైనా అనుకోవడం, చెప్పడం, ఉచిత సలహాలు ఇవ్వడం ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఆచరణకు వచ్చేసరికి చాలామంది వెనకడుగు వేస్తారు. సమాజం నుంచి, పుస్తకాలు చదవడం ద్వారా మీరు అనేక విషయాలను నేర్చుకుంటారు. కానీ అవసరమైన వాటిని ఆచరణలో పెట్టకపోతే మాత్రం లాభం లేదు అంటున్నారు నిపుణులు. అందుకే వెనకబడి పోతారు. అలా జరగకూడదు అంటే మిమ్మల్ని ముందుకు నడిపించే గొప్ప మార్గం ఒకటి ఉంది. అదే స్వీయ ప్రేరణ. మీరు సాధించాల్సిన విజయం కోసం మిమ్మల్ని కష్టపడేలా తయారు చేస్తుంది. లక్ష్యం కోసం కష్టపడేలా ప్రేరేపిస్తుంది.

Self Motivation in Telugu :ఇతరులను చూసి అసూయ చెందడం, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ నిరాశ చెందడం వంటి భావాల నుంచి, అనుకోని ఆపదల నుంచి, జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఈ స్వీయ ప్రేరణ. అనుకున్న లక్ష్యం వైపు, విజయం వైపు నడిపించడంలో దానికి మించిన అద్భుతమైన మార్గం మరొకటి లేదంటున్నారు నిపుణులు. ప్రతికూల ఆలోచనల నుంచి, పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించడంలో ఈ సెల్ఫ్ మోటివేషన్ ది బెస్ట్ మోటివేషన్ అనేది మర్చిపోకండి..!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top