Food Safety Dept : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎటువంటి పరీక్ష లేకుండా జాబ్ నోటిఫికేషన్ :TS Job Notification 2024.
TS Job Notification 2024 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏ విధమైన రాత పరీక్ష మరియు ఎటువంటి ఫీజు లేకుండా 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగి మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.ఈ జాబ్ కి 22 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక సంవత్సరం వరకు అనుభవం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం పోస్టులు, వాటి అర్హతలు:
TS Job Notification 2024 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల అర్హతలు ఇతర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్/డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టులు: ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
శాంపిల్ అసిస్టెంట్: 01 పోస్టులు: 10+2 అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
పైన తెలిపిన అర్హతలు కలిగిన అభ్యర్థులు 13త్ నవంబర్ నుండి 20 th నవంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకునెటువంటి అభ్యర్థులలో 10+2 మరియు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తారు. ఏవిధమైన రాత పరీక్ష మరియు ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నెలకు ₹ 19,500/-శాలరీ చెల్లిస్తారు. శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹ 15,600/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఎంత వయస్సు ఉండాలి:
22 నుండి 48 ఏండ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోసడలింపు ఉండదు.
అప్లికేషన్ కి కావలసిన సర్టిఫికెట్స్:
10th,10+2, డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
బయోడేటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా అప్లై చేయాలి:
ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోగలరు.
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోగలరు.