ఈ ఆకు కూర తింటే,ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు మీ సొంతం. Fenugreek Leaves in Telugu.
Fenugreek Leaves in Telugu మెంతుల సంగతి మనకు తెలిసిందే. ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆయుర్వేదంలో మెంతులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కొన్ని సంవత్సరాల పాటు పాడవకుండా, పురుగులు పట్టకుండా ఉండేటువంటి మెంతులను ఔషధాల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. మరి మెంతి కూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఇంట్లోనే సాగు:
ఎర్రటి మట్టిలో కొద్దిగా వర్మీ కంపోస్ట్ కలిపి, ఒక 30 మెంతి గింజలు వేసి,రోజూ కొద్దిగా నీరు పోస్తూ ఉంటే,20 రోజుల్లో మీకు మెంతి మొలకలు వచ్చేస్తాయి. వాటితో చక్కగా మెంతి కూర చేసుకోవచ్చు. లేదా పప్పులో మెంతి ఆకులు వేసుకోవచ్చు. సూప్ చేసుకొని తాగొచ్చు. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ మెంతి కూర వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
ప్రపంచ సాగు :
ఈ మెంతి కూర మన దేశంలోనే మాత్రమే కాదు. ఇది మొదట యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. దీని యొక్క గొప్పతనం తెలిశాక ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ మెంతి ఆకుల వాడకాన్ని పెంచడం మొదలు పెట్టాయి. భారతదేశం, ఉత్తర ఆఫ్రికా, యెమెన్ దేశాల్లో మెంతి పంట అధికంగా సాగవుతోంది.
పోషకాలు :
మెంతి ఆకుల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ. అదేవిధంగా ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఇనుము , కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ A, B, C, D ఉన్నాయి. ఇన్ని ఉన్న మెంతి ఆకుల్ని తినడం ఎంతో శ్రేయస్కరం. అందుకే ఆరోగ్య నిపుణులు మెంతులు, మెంతి ఆకుల వాడమని చెప్తున్నారు.
కొలెస్ట్రాల్ :
మీకు తెలుసుగా.. గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. ఇది ధమనుల్లో తిష్ట వేసి,Blood circulation ను అడ్డుకొని Heart attack వచ్చేలా చేస్తుంది. దీన్ని కరిగించడం అంత తేలిక కాదు. కానీ మెంతి ఆకులు తగ్గించగలవు. అలాగే మనకు అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేందుకు కూడా ఈ మెంతి ఆకులు ఉపయోగపడతాయి.
అధిక బరువు :
Fenugreek Leaves in Telugu ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ కూడా బరువు పెరుగుతున్నారు. కానీ పెరిగిన బరువు తగ్గడమే ఒక పెద్ద సమస్య గా మారిపోయింది. మీరు బరువు తగ్గాలనుకుంటే,మీ రోజు వారి డైట్ లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి. ఈ ఆకులు వేడి చేసి,కొవ్వును కరిగిస్తాయి. వీటిలో ఉండే, ఫైబర్.మెటబాలిజంను పెంచి,బరువును తగ్గేలా చేస్తుంది.
డయాబెటిస్ :
అధిక బరువు లాంటి సమస్యే డయాబెటిస్ కూడా. ప్రపంచ దేశాల ప్రజలను పీడిస్తోంది.అయితే,రక్తంలోని షుగర్ (గ్లూకోజ్) నిల్వలను క్రమబద్ధీకరించడంలో ఈ మెంతి ఆకులు బాగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలడం జరిగింది. అదేవిధంగా ఈ ఆకుల్లో ఉండేటువంటి ఆమైనో యాసిడ్ కూడా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని తెలింది. టైప్ 2 డయాబెటిస్‌ని ఈ ఆకులు బాగా కంట్రోల్ చెయడంలో ఉపయోగపడుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి.
స్కిన్ బెనెఫిట్స్ :
మన శరీరంలోకి చేరేందుకు విష వ్యర్థాలు మరియు సూక్ష్మక్రిములు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటిని అడ్డుకునే శక్తి మెంతి కూరకు ఉంది. ఇవి కణాలను Repair చేసి,విష వ్యర్థాల్ని బయటకు పంపి, చర్మంపై ముడతల్ని తొలగిస్తాయి. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు ధరి చేరకుండా చేస్తాయి.
అజీర్తి :
బయటి ఫుడ్ ఎక్కువగా తినేవారికి అజీర్తి, గ్యాస్ మరియు పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్య ఉన్న వారు ఇంట్లోనే వారానికి 2సార్లు ఈ మెంతి కూర చేసుకొని, తినడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్నగా ఉండే, ఈ ఆకులు.జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడపునొప్పి, మలబద్ధకం సమస్యలకు ఇవి చెక్ పెడతాయి.
జుట్టుకు మేలు :
Fenugreek Leaves in Telugu మెంతులను నానబెట్టి ,వాటిని పేస్టులా చేసి,జుట్టుకి రాసుకున్న వారిని మీరు చూసే ఉంటారు. అది చాలా విధంగా మేలు చేస్తుంది. మెంతు ఆకులను కూర లాగా చేసుకొని, తిన్న కూడా,జుట్టుకి లోపలి నుంచి మేలు చేస్తుంది. మెంతి కూరలో ఒమేగా 3, 6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. మెంతి ఆకుల్లోని ప్రోటీన్, Nicotinic acid .జుట్టుకు ఈ ప్రయోజనాలు కలిగిస్తాయి.
కిడ్నీ, లివర్ :
మన శరీరంలో హృదయం తర్వాత ముఖ్యమైన అవయవాలుగా కిడ్నీలు, లివర్‌ని చెబుతారు. వీటిని మెంతి ఆకులు కాపాడగలవు. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చేయడంలో ఈ మెంతి ఆకులు బాగా పనిచేస్తాయి. అలాగే Lever కణాలు దెబ్బ తినకుండా ఈ ఆకులు కాపాడతాయి. లివర్ సిర్రోసిస్ సమస్య నుంచి గట్టెక్కిస్తాయి.
ఎముకలు :
Fenugreek Leaves in Telugu మెంతి ఆకుల్లోని కాల్షియం, మెగ్నీషియం, Vitamin D.ఎముకలకు బలం ఇస్తాయి. దెబ్బతిన్న ఎముకల్ని సరిచేస్తాయి.బోలు ఎముకల వ్యాధి సమస్య వల్ల పెళుసుగా మారిన ఎముకలు కూడా తిరిగి గట్టిగా అయ్యేలా చెయ్యడంలో మెంతి ఆకులు బాగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
సంతానం :
Fenugreek Leaves in Telugu పురుషులలో సంతాన భాగ్యం కలిగించడంలో ఈ మెంతులు కొంత మేరకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు కొన్ని అధ్యయనంలో తేలింది. వీర్య ఉత్పత్తి (secretion of testosterone)ని ఇవి పెంచగలవని తెల్పడం జరిగింది.అదే విధంగా బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా మెంతి ఆకులు బాగా పనిచేస్తున్నట్లు తేల్చారు.
జాగ్రత్త :
అన్ని బాగానే ఉన్నా , కానీ ఆకులు ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తాయి. కొంతమందికి అలర్జీ సమస్య వస్తుంది. అదేవిధంగా ఈ ఆకులు ఎక్కువగా తీసుకుంటే,అతి మూత్ర సమస్య కూడా వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ మెంతులు, మెంతి కూర ఎంత స్థాయిలో వాడొచ్చో అనేది డాక్టర్ సలహా పాటించాలి.
వారికి వద్దు:
Fenugreek Leaves in Telugu గర్భిణీ స్త్రీలు మెంతులు, మెంతి కూరను వాడకపోవడం మేలు. ఇవి గర్భస్రావం అయ్యేలా చెయ్యగలవని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై డాక్టర్ సలహా పాటించడం మేలు.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు సేకరించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు దీన్ని అతిగా తినాలని అనుకునే వారు మాత్రం వైద్యుల సలహా మేరకు పాటించడం ఉత్తమము.