Water Chestnut in Telugu: ఈ చలికాలంలో మీరు తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడంతో,ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Water Chestnut in Telugu: ఈ చలికాలంలో మీరు తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడంతో,ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Water Chestnut in Telugu: వాటర్ చెస్ట్‌నట్ నీటి అడుగున పెరిగేటువంటి ఒక మొక్క.చెస్ట్‌ నట్‌ను పోలి ఉన్నప్పటికీ ఇది గింజ కాదు.మందపాటి పై తొక్క. ఎక్కువ నీటిని కలిగి.లోపల తెల్లటి గుజ్జు కలిగిన కూరగాయ. దీనిని తొక్క తీసి పచ్చిగా తింటారు. లేదా ఉడికించి తింటారు. అయితే దీన్ని ఉడకపెట్టి తింటే, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ విషయంపై నిపుణుల సూచనలు, సలహాలు ఇచ్చారు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Water Chestnut in Telugu: వాటర్ చెస్ట్‌నట్ దొరికే సీజన్ వచ్చేసింది. ఈ శీతాకాలంలో వాటర్ చెస్ట్‌నట్లు కూరగాయలతో పాటు మార్కెట్ లో చాలా సందడి చేస్తాయి. ఇవి చిత్తడిగా ఉండే, నేలలు, చెరువులు మరియు వరి పొలాలు, లోతులేని సరస్సులలో నీటి అడుగున పెరుగుతూ ఉంటాయి. కనుక వీటిని వాటర్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు.

Water Chestnut in Telugu: వాటర్ చెస్ట్‌నట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. చాలామంది దీనిని ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. అటువంటి సమయంలో కొందరు వీటిని ఉడకబెట్టుకుని, లేదా సలాడ్ రూపంలో గానీ తింటారు. ఇలా వీటిని చాలా రకాలుగా తినే ఆహారంలో చేర్చుకొని తింటుంటారు.

ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఇందులో Vitamin C, manganese, protein, thiamine, ఇంకా అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని ఉడికించిన నీరుని , చెస్ట్నట్ ను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉడికించిన నీరు మరియు చెస్ట్నట్ తింటే , చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఈ వాటర్ చెస్ట్‌నట్ లోని స్టార్చ్ ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వాటర్ చెస్ట్‌నట్ తినడం వలన హెయిర్ సమస్యలకు కూడా మంచి ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని డైటీషియన్ నిపుణులు చెప్పారు. ఇందులో ఉండేటువంటి Laric యాసిడ్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తినడం వల్ల స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు కచ్చితంగా వాటర్ చెస్ట్‌నట్‌ను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

ముఖ్యంగా చలికాలంలో కొందరు తగినంత నీరు తాగరు. దీని వలన శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. వీటిని ఉడికించిన నీరుతో పాటు చెస్ట్‌నట్ లను తినడం వల్ల శరీరంలో హైడ్రేషన్ మెయింటెయిన్ అవుతుంది. తక్కువ పరిమాణంలో నీరు తాగే వారు ఈ సీజన్ లో ఖచ్చితంగా వాటర్ చెస్ట్‌నట్ తినమని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా డీహైడ్రేషన్ సమస్య అనేది ఉండదు.

బరువు తగ్గడానికి డైట్ ను అనుసరించే వారు తాము తినే ఆహారంలో ఈ నీటి చెస్ట్‌నట్‌లను చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వాటర్ చెస్ట్‌నట్‌లు అధిక ఫైబర్ ఉన్న ఆహరం. ఇవి తినడం వలన ఎక్కువ సేపు హారం తినకుండా, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.

Water Chestnut in Telugu: నిపుణులు నీటి చెస్ట్ నట్ యొక్క అన్ని ప్రయోజనాలను చెప్పారు. చలికాలంలో ఈ పండును ఉడకబెట్టి తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

గమనిక : ఈ పై సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదేని ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top