మగ పిల్లల కోసం అద్భుతమైన సేవింగ్ స్కీమ్స్ ఇవే…! అదిరిపోయే బెనిఫిట్స్: Best Post Office Scheme for Boy Child:2024
Best Post Office Scheme for Boy Child: కేంద్ర ప్రభుత్వం చాలా రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. అందులో అమ్మాయిల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకంను తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పది సంత్సరాల లోపు ఆడ పిల్లల పేరుపై పొదుపు చేసుకోవచ్చును.
Best Post Office Scheme for Boy Child:ఇప్పటికే లక్షల్లో ఖాతాలు తెరిచారు. మరి మగ పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎలాంటి పథకం అందుబాటులో ఉన్నాయి.మరియు ఏ పథకాల్లో మగ పిల్లల పేరుపై ఇన్వెస్ట్ చేయవచ్చు? పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మంచి పెట్టుబడి పథకం కోసం చూస్తున్న మగ పిల్లల తల్లిదండ్రలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తోంది.
Best Post Office Scheme for Boy Child:అందులో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్, పోస్టాఫీసు Monthly Income Scheme, Recurring Deposit వంటివి చాలా ఉన్నాయి. వీటిల్లో నెల నెల Invest చేయడంతో పాటు ఒకేసారి పెద్ద మొత్తంలో Invest చేసి Monthly income సైతం పొందవచ్చు. ఇప్పుడు మనం ఐదు బెస్ట్ సేవింగ్స్ స్కీమ్, వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్..
Post Office ఆధ్వర్యంలో 1988లో కిసాన్ వికాస్ పత్ర పతకమును తీసుకొచ్చింది కేంద్రం. తక్కువ ఆదాయ వర్గాలకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. మగ పిల్లల పేరుపై ఒక స్వల్ప కాలిక Post Office Savings Scheme. వార్షికంగా ఒక నిర్దిష్ట మొత్తం Invest చేయడానికి ఈ పథకం అనుమతిస్తుంది. 18
సంత్సరాల వయసు వచ్చిన వారెవరైనా ఈ పథకంకు అర్హులు. అయితే, 18 సంత్సరాల లోపు వయసు ఉంటే వారి తరపున Guardians, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీష్టంగా రూ. 1000 నుంచి గరిష్ఠంగా ఎంతైనా Invest చేసేందుకు వీలుంది. వార్షిక వడ్డీ 7.9%గా నిర్ణయించింది కేంద్రం. మెచ్యూరిటీ టెన్యూర్ 10 సంత్సరాల 4 నెలలుగా ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..
Best Post Office Scheme for Boy Child: National Savings Certificate (NSC) తక్కువ Risk, Fixed Income అందించేటువంటి బెస్ట్ పథకం. ఇందులో పన్ను ప్రయోజనాలతో పాటు చిన్న మరియు మధ్య ఆదాయ Inverters ను ప్రోత్సహించడమే లక్ష్యం. 18 సంత్సరాలలోపు పిల్లల పేరుపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ తీసుకోవచ్చు. కనీసం రూ. 1000 నుంచి మొదలుకొని గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో 7.7 శాతం వార్షిక వడ్డీ వస్తోంది. మెచ్యూరిటీ టెన్యూర్ 5 ఏళ్లుగా ఉంటుంది.
పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ ప్లాన్.
మగ పిల్లల కోసం పోస్టాఫీసు అందిస్తున్న పొదుపు పథకం. నెలవారీ ఆదాయ పథకంలో కనిష్ఠగా రూ.1000 నుంచి.. రూ.4.5 లక్షల వరకు invest చేయవచ్చు. ఈ పథకం వడ్డీ రేటును ఇటీవలే పెంచింది కేంద్రం. ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ ఇస్తోంది. నెలవారీగా ఇందులో వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయం 5 ఏళ్లు ఉంటుంది. ఈ స్కీమ్‌కు టీడీఎస్ వర్తించదు. సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
రికరింగ్ డిపాజిట్స్..
మగ పిల్లల పేర్ల పై పెట్టుబడి పెట్టాలనుకునే వారు పోస్టాఫీసు అందిస్తున్న ఈ పథకం ను ఎంచుకోవచ్చు. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌తోనే అధిక వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు. లాకిన్ పీరియడ్ 3 నెలలు. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. గరిష్ట పరిమితి లేదు. వడ్డీ రేటు 5.8 శాతం. మీరు ఈ ప్లాన్ నుంచి మీ సేవింగ్స్ ఖాతాకు నిధులను బదిలీ చేసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్
Public Provident Fund (PPF ) అనేది పన్ను ఆదా చేయడానికి రూపొందించినట్లు చెప్పుకోవచ్చు. మగ పిల్లలకు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.500గా ఉంది. గరిష్ఠ పెట్టుబడి రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్ 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. టెన్యూర్ ముగిసిన తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.