Black Pepper in Telugu : వీటిని రోజూ తీసుకుంటే,ఈ అనారోగ్యాలు అన్నీ పరార్..! Miriyalu in Telugu.

Black Pepper in Telugu : వీటిని రోజూ తీసుకుంటే,ఈ అనారోగ్యాలు అన్నీ పరార్..! Miriyalu in Telugu.

Black Pepper in Telugu : భారతీయ వంటగదిలో మిరియాలు కచ్చితంగా ఉంటాయి. మిరియాలు ఎటువంటి వంటకంలో వేసినా సరే,దాని రుచిని రెట్టింపు చేస్తాయి. మిరియాలతో చేసే రసం అయితే చాలా మంది ఇష్టంగా తింటూ, ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప ఔషధంలాగా కూడా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాల కారనణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా చుస్తే, నల్ల మిరియాలను శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం.

Miriyalu in Telugu : మిరియాలను “Black Gold” అని కూడా పిలుస్తారు. వీటిలో Magnesium, iron, potassium,C, K విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో Anti-Inflammatory, Anti-Bacterial, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ ఆహరంలో కొంచెం చేర్చుకున్నా సరే,అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మిరియాల్లోని ‘పెపరిన్‌’ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా Diabetes వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇతర ఆహారాలతో పాటు మీ రోజువారీ డైట్ లో ఈ మిరియాలు చేర్చుకోవడం వల్ల Vitamins B, C, సెలీనియం, బీటా-కెరోటిన్ వంటి అవసరమైన పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే నల్ల మిరియాలలో Piperine అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఈ పోషకాల జీవ లభ్యతను పెంచుతుంది.

బెర్రీలు, వేరుసెనగలో ఉండేటువంటి Resveratrol వంటి ప్రయోజనకర పదార్థాలను మెరుగ్గా శోషించుకునే సామర్థ్యం ఈ మిరియాల వల్ల మన శరీరానికి అందుతుంది. గుండె జబ్బు, క్యాన్సర్‌, అల్జీమర్స్‌, డయాబెటిస్‌, వంటి రుగ్మతల నుంచి Resveratrol రక్షిస్తుంది. అయితే పేగులు శోషించుకునేలోగానే ఈ పదార్థం విచ్ఛిన్నమవుతుంటుంది. శరీరంలో దీని లభ్యతను పెంచడంలో మిరియాలు చాలా దోహదపడతాయి.

Black Pepper in Telugu జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్థాయి. బెటర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ , మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది. ఇది ఆహారం నుండి అవసరమైన పోషకాలను శరీరం సమర్ధవంతంగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, బాడ్ బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధిక ఆకలిని కూడా నియంత్రిస్తాయి.

మిరియాలలో Vitamin C, Vitamin A, Flavonoids, Carotenoids వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పైపరైన్‌ అనే రసాయనం ఉంటుంది. కాబట్టి ఇది మిరియాలకు ఘాటైన వాసన, రుచిని ఇస్తుంది. శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్‌గానూ ఇది పనిచేస్తుంది.హృదయ జబ్బులు, క్యాన్సర్‌, ఉబ్బసం, మధుమేహం, చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా,అడ్డుకుంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

రొమ్ము, ప్రోస్టేట్‌, పెద్ద పేగు క్యాన్సర్‌ కణాల పునరుత్పత్తిని పైపరైన్‌ తగ్గించినట్లు, క్యాన్సర్‌ కణాలు చనిపోయేలా చేసినట్లు ప్రయోగాల్లో తేలడం జరిగింది. Triple Negative “Breast Cancer “చికిత్సలో Piperine అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని, శాస్త్రవేత్తలు తెలిపారు.క్యాన్సర్‌ కణాల్లో బహుళ ఔషధ నిరోధకతను తగ్గించే సామర్థ్యమూ Piperine కు ఉంది. ఇలాంటి నిరోధకత వల్ల కీమోథెరపీ సమర్థత తగ్గుతుంది.

మిరియాలలోని పైపెరిన్‌, యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ప్రో-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. మిరియాలు ఆర్థరైటిస్, ఆస్తమా, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

నల్ల మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తారు, తద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. Piperine Thermogenesis ను మెరుగుపరుస్తుంది, ఈ ప్రక్రియ ద్వారా శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది, కేలరీలను Burn చేస్తుంది. Additionall గా, నల్ల మిరియాలు కొవ్వు కణాల నిర్మాణాన్ని అణిచివేస్తాయి, బరువు పెరిగేటువంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

మిరియాలలోని ఔషధ గుణాలు దగ్గు, శ్వాసకోశ రద్దీ, Sinusitis వంటి శ్వాసకోశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. Black Pepper శ్లేష్మం యొక్క ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి. శ్వాసకోశం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. దీనిలోని యాంటీ బాక్టీరియల్‌ గుణాలు శ్వాసకోశ Infections ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన చిన్న సమస్యలు ఉన్నా సరే, వైద్యులను సంప్రదించడమే మంచి మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top