Jokes in Telugu : నవ్వుకుందాం.. కాసేపు.. నవ్వు వలన 40 రకాల ఆరోగ్య ప్రయోజనాలు.

Jokes in Telugu : నవ్వుకుందాం.. కాసేపు.. నవ్వు వలన 40 రకాల ఆరోగ్య ప్రయోజనాలు .


Jokes in Telugu : అంతర్జాతీయ జోక్స్ దినోత్సవం. సందర్భంగా మీరు హాయిగా నవ్వుకోవడానికి అంతేకాకుండా మీ మనసు బాగాలేనప్పుడు మీ మనసు ప్రశాంప్రశాంతత కోసం ఇక్కడ కొన్ని జోక్స్ ని ఇస్తున్నాం. వీటిని చదువుకొని, హాయిగా నవ్వుకోండి.

Wife and Husband Funny Jokes in Telugu : మన శరీరంలో హాస్య గ్రంథులు ఉన్నాయా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి ? మనముందు ఎవరైనా జోక్ చెప్తే , రియాక్ట్ అయి, ముఖంలో నవ్వు వచ్చిందనుకోండి, మన లోపల హాస్య గ్రంథులు ఉన్నట్లు. నవ్వు రాలేదనుకోండి, హాస్య గ్రంథులు లేనట్లు. దాదాపు అందరికి హాస్య గ్రంథులు ఉంటాయి.

Jokes in Telugu : నవ్వు ఒక దివ్య ఔషధం అని పెద్దలు చెప్తారు, నవ్వితే 40 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒక చిన్న జోక్ అయినా సరే మనుషులను నవ్వించేలా చేస్తుంది. వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా చేయగలదు.

Jokes in Telugu : నవ్వుకు ఉండే ప్రయోజనాలను, పరిహాసానికి ఉండే ప్రాధాన్యతను గురించి చెబుతూ ప్రతీ ఇయర్ July 1న Jokes Day గా నిర్వహిస్తారు. ఒక Joke ద్వారా అందరి మొఖాల్లో నవ్వును వెలిగించటం,కొంత సమయం పాటు ఆనందాన్ని కలిగించటం లక్ష్యంగా ఈ రోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యంగా ఈ Jokes Day ని జరుపుకుంటారు.ఈ సందర్భంగా మీరు హాయిగా నవ్వుకోవడానికి మీకోసం ఇక్కడ కొన్ని జోక్స్ ఇస్తున్నాం.


😂 మంచి మొగుడు దొరకడం కష్టం.
అందంగా ఉన్నాడు అనుకుంటే , మెదడు ఖాళీగా ఉంటుంది.
డబ్బున్నోడు అనుకుంటే , అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు.
తెలివైన వాడు అనుకుంటే, సీరియస్ గా ఉంటాడు.
బాగా కష్టపడతాడు అంటే, నిన్ను కూడా పట్టించుకోడు.
నెమ్మదిగా ఉన్నడనుకుంటే,ఆయనో భగ్న ప్రేమికుడు.
భాద్యతగా ఉన్నాడు అనుకుంటే,ఒక ముద్దు ముచ్చట ఉండదు.
చదువుకున్నాడు అనుకుంటే,నేను పట్టిన కాలుకు మూడే,కాళ్ళు అంటాడు.
చదువు లేని వాడు అనుకుంటే,నువ్వేమన్నా అవమానిస్తున్నాడు అంటాడు.
స్మార్ట్ గా ఉన్నాడు అనుకుంటే,అబద్దాల పుట్ట ……
ఎలా చచ్చేదిరా దేవుడా….


😜 ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాప్ కి వెళతాడు.
ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి, కౌంట్ చెయ్యాలా.. కత్తిరించాలా అంటాడు. విసుగ్గా. 😕
అద్దంలోకి తన వెంట్రుకలు చూసి, మురిసిపోతూ ఇలా అంటాడు. రెండూ.. కాదు , కలరెయ్… 😂😜

😂 డాక్టర్ : నువ్వేం సబ్బు వాడతావ్?
రోగి: ధనుంజయ సబ్బు.
డాక్టర్ : టూత్ పేస్ట్ ?
రోగి : ధనుంజయ టూత్ పేస్ట్.
డాక్టర్ : షాంపూ ?
రోగి : ధనుంజయ షాంపూ.
డాక్టర్ : ధనుంజయ ఇంటర్ నేషనల్ బ్రాండా?
రోగి : కాదు.. ధనుంజయ్ నారూమ్ మేట్ .


😂 Dear Employees ✌
శనివారం ఆశపెట్టి… అమాంతంగా ఆవిరయ్యేదే “ఆదివారం”

😂 కాక “చేతబడి” ని ఇంగ్లీషులో ఏమంటారు..!
ఏముంది కాక.. “హ్యాండ్ బడి” అంటారు.

😂 దేవుడా ! నాకు లాటరీలో కోటి రూపాయలు వస్తే, సగం నీకె ఇస్తాను.
అంటూ వేడుకున్నాడు సుబ్బారావు. ఆ మర్నాడే సుబ్బారావు కి లాటరీలో యాభై లక్షలు వచ్చాయి.
“ఓహ్ ! నీ వాటా ముందుగానే తీసుకున్నావా దేవుడా!” అనుకుంటూ , సొమ్మంత సూట్ కేసులో కుక్కేసుకున్నాడు.

😂తెలుగులో మాట్లాడమంటారు. తెలుగులో మాట్లాడితే తెల్లమొహమేస్తారు.
ఇందాక ఒక షాపులో బంతి పువ్వు బిస్కెట్లు గాని, దాగుడు మూతల బిస్కెట్లు గాని ఉన్నాయా?
అని అడిగా… అలా పిచ్చి చూపులు చుస్తున్నాడేంటి…?

😂 ఊరంత అప్పులు ఉన్నవాడున్నవాడి పేరు కోటీశ్వరరావు…
50 మందికి విడాకులు ఇప్పించిన లాయరు పేరేమో కుటుంబరావు.

😂 ఎంత రిచ్ అయినా హాచ్చ్… అనే తుమ్ముతాడు. గాని రిచ్ అని తుమ్మడు!

😂 ఏమండి నా నెక్లెస్ పాతదైంది. కదండీ కొత్తది చేయించుకుంటానండి.
ఏమే నువ్వుకూడా పాతగయ్యావుగానే రెండో పెళ్లి చేసుకుంటానేంటే…

😂 అమ్మాయి తండ్రి: చాలా గారాబంగా పెంచామండి. వంట రాదు.మీరే కొంచం సర్దుకొంది
అబ్బాయి తండ్రి : మేము కూడా చాలా గారాబంగా పెంచమండి. ఏ JOB లేదు. మిరే సర్దుకోవాలి.

😂 భార్య : ఏమండి స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివ్వరట ఎందుకండీ?
భర్త : ఓసి,.. పిచ్చి మొఖమా స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే , అది స్వర్గం ఎలా అవుతుందే.. మల్లి నరకమే అవుతుంది గని..

😂 ఒక అమ్మాయి ఓ ఫంక్షన్ లో పదే పదే దగ్గుతుందంటే , తనకి దగ్గు,జలుబు ఉందనుకుంటే,పొరపాటే,
తన నగల, చీరల వంక చూడమని అసలైన అర్థం.

😂 సరదాగా కాసేపు :
గిరి : సిరి నేను మీకు ఏమైనా అప్పు ఉన్నానా..??
సిరి : అలా ఏం లేదే.. ఎందుకలా అడుగుతున్నారు గిరి..!!
గిరి : ఏం లేదు… రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను…

😂 భార్య : కరెంటు అస్తమానం వచ్చి పోతుందండి. ఏం చేయాలి ?
వెంగళప్ప : ఈ సారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్ !

😂 రంగ : ఇప్పుడైనా నా జీతం పెంచండయా..
యజమాని : ఏం ఎందుకని ?
రంగ : నాకు పెళ్లి చేస్తున్నారయ్యా.
యజమాని : బయట జరగబోయే ప్రమాదాలకు నేను బాధ్యత ఎలా వహించాను!


😂 అప్పారావు : ఆ బస్సుకి బ్రేకులు సరిగా పడవు…
రంగారావు : నీకెలా తెలుసు !
అప్పారావు : రోజు బస్టాప్ కి కొంచెం ముందు గానీ ,తర్వాత గానీ , ఆగుతుంది మరి.!

😂 రాజారావు: కళ్ళజోడు పెట్టుకోలేదేంటి నువ్వు…
కాంతారావు : ఇదిగో పెట్టుకున్నానే…
రాజారావు : అవునా !… అయితే నేనే పెట్టుకోలేదన్న మాట!


😂 యాచకుడు : ఒక్క రూపాయి ధర్మం చేయండయ్యా…
శీను : రెండు వేళా నోటు మాత్రమే ఉంది. చిల్లర లేదు…
యాచకుడు: పర్లేదయ్యా.. మళ్లీ 1999 సార్ల వరకు మిమ్మల్ని అడగను.!


😂 రాము: ఎప్పుడూ తల నొప్పి అంటుంటావ్. నన్ను చూడు ఒక్కసారి కూడా రాదు…
సోము : అది తల ఉన్నవాళ్లకే వస్తుందిలే !


😂 సూరి : నీకు క్యారమ్స్ ఆడటం వచ్చా?
వెంగళప్ప : ఆ వచ్చు. పదండి గ్రౌండ్ కు వెళదాం.

Jokes in Telugu : ఈ జోక్స్ ని మీరు చదివిన తర్వాత మీ మొఖాల్లో నవ్వులు విరబూసాయనే మేము భావిస్తున్నాం. మీరు ఈ జోక్స్ అందరికీ పంపుతూ వారి ముఖాల్లోనూ నవ్వులు పూయించండి.. జోక్స్ డే శుభాకాంక్షలు! Jokes in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top