Glamour Bike New Model.ఎట్టకేలకు BS 6 హీరో గ్లామర్ బైక్ వచ్చేసింది..! ధర కూడా కొంచెం పెరిగింది. 2024.
Glamour Bike New Model:ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉన్న సంస్థల్లో హీరో కూడా ఒకటిగా ఉంది . వినియోగదారుల అభిరుచి మేరకు సరికొత్త మోటార్ బైకులను ఇండియా మార్కెట్లో విడుదల చేస్తూ తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బీఎస్4 నుండి బీఎస్6 ఫార్మాట్లోకి తన వాహనాలను Update చేస్తోందీ ఈ సంస్థ.
Glamour Bike New Model:ఇప్పటికే హీరో స్ప్లెండర్ ప్లస్, డెస్టిని 126, Maestro Edge లాంటి బైక్స్ ను భారత విపణిలో లాంచ్ చేసిన హీరో సంస్థ . ఎట్టకేలకు తన టూ వీలర్స్ లో అత్యధిక విజయవంతమైన గ్లామర్ 125 మోడల్ ను బీఎస్6లోకి Update చేసింది. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు మంచి నేస్తంగా ఈ మోటార్ సైకిల్ గుర్తింపు తెచ్చుకుంది.
ధర..
Glamour Bike New Model:ఢీల్లీ ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో గ్లామర్ 125 బైక్ ప్రారంభ ధర రూ.68,900. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ మోటార్ బైక్ ల వేరియంట్ల వారీగా వెలలో వ్యత్యాసముంది. BS 4 మోడల్ కంటే BS 6 బైక్ ఖరీదు 1450 రూపాయలు మాత్రమే ఎక్కువ ఉండటం విశేషం అయింది.
వేరియంట్ల ధర..
హీరో డ్రమ్ వేరియంట్ ధర………. రూ.68,900
హీరో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర…….రూ.72,400
డిజైన్..
ఓల్డ్ మోడల్ తో పోలిస్తే ఈ బైక్ లో డబుల్ క్రాడిల్ చేసిస్ స్థానంలో న్యూ డైమండ్ ఫ్రేమ్ ను అమర్చారు. స్మోక్ ఫినిష్ తో ఉన్న పైలట్ ల్యాంపులు, Rare panels,లాంటివి బీఎస్4తో పోలిస్తే ఈ సరికొత్త మోటార్ బైకుల్లో పొందుపరిచారు. హార్డ్ వేర్ అంశంలోనూ చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. టైర్లు గతంతో పోలిస్తే వెడల్పుగా ఉండి,Rare panels, అధికంగా ఉండనుంది. అంటే ముందు టైరు 14%, వెనుక టైరు 10 %ఎక్కువ సస్పెన్షన్ తో ముందుకు వచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 30 % మెరుగ్గా ఉంది.
ఫీచర్లు..
ఫీచర్ల విషయానికొస్తే బీఎస్4 మోడల్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్లు ఈ సరికొత్త బీఎస్6 గ్లామర్ 125 మోటార్ సైకిల్లోనూ ఉండనుంది. Revised instrument cluster, Real Time Economy Indicator లాంటి ప్రత్యేకతలతో ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ బైక్ 4 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎరుపు, నీలం, Tornado Grey, Sports రెండు రంగుల్లో దొరుకుతుంది.
ఇంజిన్..
బీఎస్6 గ్లామర్ 125 మోటార్ బైకుల్లో Power output లాంటి వివరాలను సంస్థ ప్రకటించలేదు. అయితే ఓల్డ్ మోడల్ తో పోలిస్తే 19 శాతం మెరుగైన Performance తో వస్తుందని తెలుస్తోంది. బీఎస్4 Model125 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 12 పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది.
అంతేకాకుండా ఓల్డ్ మోడల్ 4-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటే కొత్తగా వస్తున్న BS 6 మోడల్ 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఇండియా మార్కెట్లో బీఎస్6 గ్లామర్ 125 బైక్ కు పోటీగా హోండా ఎస్ పీ 125, Bajaj Pulsar 125 మోటార్ సైకిళ్లు ఉన్నాయి.