Prawns Benefits in Telugu: మీకు రొయ్యలంటే,బాగా ఇష్టమా…! ఎటువంటి రొయ్యలు ఆరోగ్యానికి మంచివి..?
Prawns Benefits in Telugu నాన్ వెజ్ ను బాగా ఇష్టపడి తినే వారికి ఈ రొయ్యలు (Prawns) కూడా అందులో ఒకటి అని చెప్పవచ్చు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం కూడా. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా కాపాడే,గుణాల్ని కలిగి ఉంటాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒక్కటి కాదు , చర్మ సమస్యలకు, బాడ్ కొలెస్ట్రాల్ ని తొలగించడంలో మరియు మతిమరుపును దరి చేరకుండా చూడటంలో బాగా పని చేయటంలో ఉపయోగపడుతుంది.
Prawns Benefits in Telugu మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అంటే, ఏదైనా అతిగా తిననంతవరకు ఆరోగ్యానికి మంచిదే. ఈ మధ్యకాలంలో, నిండా 30 ఏళ్లైనా నిండకుండానే చాలా మంది యువత గుండెపోటుకు గురై చనిపోతున్నారు. రొయ్యలు తింటే హృదయ ఆరోగ్యం మెరుగు పడుతుందన్న విషయం మీకు తెలుసా..? ఇంకా రొయ్యలలో ఏమేం ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి చాలా మంచిది:
రొయ్యలు తింటే, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువుని తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. రొయ్యలలోని Proteins కండరాల నిర్మాణానికి, కొత్త కణ జాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు Prawns తరచూ తింటే, జీవక్రియలు సరిగ్గా జరుగుతూ,హార్మోన్ల సమస్య తగ్గుతుంది.
అధిక బరువును తగ్గిస్తుంది:
అధిక బరువుని తగ్గించడంలో కూడా ఈ రొయ్యలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే Vitamin B12 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. Vitamin C చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మసౌందర్యానికి ఎంతో మేలును కూడా చేస్తుంది.
రక్త హీనత సమస్య ఉండదు:
రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి. ఈ సమస్య ఉన్నవారు అప్పుడప్పుడు రెగ్యులర్ గా తింటూ, ఉండాలి. అలాగే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన బాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఇవి సహాయపడుతుంది.
అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి:
ముప్పై సంవత్సరాలు దాటిన వారు తరచుగా Prawns తింటే,అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆహార నిపుణులు, పరిశోధనలు చెబుతున్నాయి.
పైన పేర్కొన్న ఉపయోగాలన్నీ సముద్రపు రొయ్యల ద్వారా లభిస్తాయి. వాటిలో Glass shrimp, knife shrimp (గాజు రొయ్యలు, చాకు రొయ్యలు ) అని రకాలు కూడా ఉంటాయి. వనామీ అంటే, కానీ చెరువులలో పండించిన రొయ్యలు తింటే, అనారోగ్యమే తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అలాగే రొయ్యలను బాగా శుభ్రం చేసుకుని, తినాలి. లేదంటో అనారోగ్య సమస్యలుఎదురవుతాయి.
గమనిక : పైన తెలిపిన సమాచారం మొత్తం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని అతిగా తినాలి అనుకునే వారు మాత్రం వైద్యుల సలహాలు,సూచనలు తీసుకొని పాటించడం ఉత్తమం.