BTech, Diploma, BSc గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్లకి శుభవార్త..! రైల్వే శాఖ 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఉండాల్సిన అర్హతలివే… RRB JE Recruitment 2024
RRB JE Recruitment 2024 : భారతీయ రైల్వే (Indian Railway) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా శాఖల్లో Diploma, Engineering Degree, B.Sc పూర్తిచేసిన యువతకు ఇదో సువర్ణావకాశం. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉద్యోగాల భర్తీకి Railway Recruitment Board (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
RRB JE Recruitment 2024 : ఈ ప్రకటన ద్వారా 7,951 Junior Engineer, Chemical Supervisor ఖాళీలు భర్తీ పూర్తి చేయనున్నారు. RRB Online దరఖాస్తు ప్రక్రియ July 30వ తేదీ నుంచి ప్రారంభమై August 29 వరకు కొనసాగనుంది. 2 దశల వారీగా పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక చేయడం ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి , అలాగే, Online Application Link ఇదే. Click చేయండి.
RRB JE Recruitment 2024 :ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం రీజియనల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 7,951
Chemical Supervisor/ Research and Metallurgical Supervisor/ Research : 17 పోస్టులు (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే) Junior Engineer, Depot Material Superintendent, Chemical and Metallurgical Assistant : 7,934 పోస్టులు
ఇతర ముఖ్య సమాచారం :
అర్హత: Post ను అనుసరించి సంబంధిత శాఖలలోDiploma (Engineering), Bachelor Degree (Engineering/ Technology), B.Sc ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: Chemical and Metallurgical, Civil, Electronics, Electrical, Mechanical, Chemistry and Physics తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.
ప్రారంభ వేతనం : జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400.. కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్: రూ.44,900 ఉంటుంది.
ఎంపిక విధానం: Stage-1, Stage-2 Computer Based Test (CBT), Document Verification, Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: July 30, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించుటకు ఆఖరి తేదీ: August 29, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: August 30 నుంచి September 8 వరకు చేసుకోవచ్చు.