Tsspdcl Bill Payment : విద్యుత్ బిల్లుల యూపీఐ చెల్లింపులకు తొలగిన అడ్డంకులు
Tsspdcl Bill Payment : విద్యుత్తు బిల్లులను గతంలో మాదిరి మొబైల్ ద్వారా UPI చెల్లింపులు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్సీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసిపిడిసిఎల్ భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బిబిపిఎస్) లో చేరాయి. డిస్కామ్లు బి పి ఎస్ లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, పిన్టెక్ యాప్ లు , వెబ్సైట్లతో పాటు బీబీ పిఎస్ ఆధారిత ఫ్లాట్ ఫామ్ లా ద్వారాను బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్పిసిఐ కి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్ బిబిఎల్…. సీఈఓ నూకూర్ చతుర్వేది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టిజిఎస్సిడిసిఎల్ ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తుంది మిగతా సంస్థలతో ను చర్చిస్తున్నామని గూగుల్ పే అమెజాన్ పే ద్వారా ను రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఓ అధికారి తెలిపారు…