Mustard Seeds in Telugu : చిట్టి ఆవాలే కదా.. అని అనుకుంటున్నారా..!వాటితో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే, షాక్ అవ్వాల్సిందే..!

Mustard Seeds in Telugu : చిట్టి ఆవాలే కదా.. అని అనుకుంటున్నారా..!వాటితో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే, షాక్ అవ్వాల్సిందే..!

Mustard Seeds in Telugu : మనం ఎటువంటి వంటైనా సరే, వండేటప్పుడు ఖచ్చితంగా ఈ చిట్టి ఆవాలను ఖచ్చితంగా వేసుకుంటాం.పచ్చళ్ళు అయినా కూరలు మరియు చారు వంటి వాటిల్లో ఇలా ఏ వంటైనా వంటల్లో చాలా మంది ఆవాలని వేస్తారు.వీటిని అలాగే కూడా వేస్తారు.లేదంటే,కొంతమంది ఈ ఆవాలని పిండిలా చేసి, ఆ పౌడర్ అయినా వాడతారు. దీనికి కారణం.టెస్ట్ మాత్రమే కాదు.ఆవాల్లోని గొప్ప గుణాలు ఉంటాయి కాబట్టి. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల BP కంట్రోల్ అవుతుంది. అంతేకాదు శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. వీటన్నింటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. హృదయ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఈ చిట్టి ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు మరియు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని తగ్గించడంలో ఆవాలు ముందుంటాయి. అందుకే, రోజు ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలున్నా దూరం అవుతాయి.

ఆవాల్లో కొన్ని గుణాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. వీటితో కొన్ని రకాలCancers రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, Ringworm వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.

ఆవాల్లో Phenolic compounds, tocopherols అనే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి, Liver పనితీరుని మెరుగ్గా చేస్తుంది. వీటితో పాటు Digestion సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయి.

ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి వలన ముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, కచ్చితంగా రెగ్యులర్‌గా వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం చేసుకోండి.

ఆవాల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మీ చర్మం మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని కూడా బలంగా చేస్తాయి. ఆవాల్లోని Vitamin A, K, C. లు ఉండడం వలన వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యులని సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top