Petrol Bunk Services : పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలను ఫ్రీగా పొందవచ్చు.
Petrol Bunk Services : మన వెకిల్ లో పెట్రోల్ లేదా డీజిల్ అయిపోగానే,పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. మనం రోడ్లపై వెళ్లే టైంలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే, మనకు పెట్రోల్ బంకులు గుర్తుకురావు. ఓన్లీ వెహికిల్స్ల్లో fuel లేకుంటే మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ పెట్రోల్ బంకుల్లోనూ మీరు వివిధ రకాల services లను పొందవచ్చుననే విషయం చాలా మందికి తెల్సి ఉండదు. ఫ్రీ టాయిలెట్, ఫ్రీ మంచినీరు, వాహనాలకు ఉచితంగా గాలి చెకింగ్ వంటి పలు రకాల సౌకర్యాలు ఉంటాయి. పెట్రోల్ బంకుల్లో ఉచితంగా అందించే సేవలు ఏమిటో అవి ఇక్కడ తెలుసుకుందాం.
Petrol Bunk Services : నాణ్యత , స్వచ్ఛత చెక్ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని, సరైన పరిమాణాన్ని సరైన price వద్ద అందించాలి. ఏ పెట్రోల్ బంకులో అయినా మీరు పెట్రోల్ లేదా డీజిల్ Quality ని తెలుసుకునేందుకు Filter paper test అడగవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. క్వాంటిటీ పైన అనుమానం అది కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇది మీ హక్కు. పెట్రోల్ బంక్ యాజమాన్యం నిరాకరించరాదు. అలాగే, ఛార్జీ కూడా వసూలు చేయలేరు.
ఫస్ట్ ఎయిడ్ కిట్ :
రోడ్ల పైన తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు రోడ్డుపై వెళ్లే టైంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే, సమీపంలోని పెట్రోల్ బంకుకు దగ్గరకు వెళ్లి , వారి చికిత్స కోసం First aid box ని అడగవచ్చు. పెట్రోల్ బంకులు పూర్తి ప్రథమ చికిత్స వస్తు సామాగ్రిని కలిగి ఉండాలి.
ఎమర్జెన్సీ కాల్ :
మీకు అత్యవసరమైనప్పుడు ఫోన్ చేసేందుకు కూడా ఈ పెట్రోల్ బంకుకు వెళ్లవచ్చు. Urgent సమయంలో ఫ్రెండ్ కి లేదా ప్రమాదం బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు లేదా ఎవరికైనా ఫోన్ చేయడానికి పెట్రోల్ బంక్స్ ఫ్రీ కాల్ సౌకర్యం అందించాలి. కాబట్టి ఈసారి మీ ఫోన్లో హఠాత్తుగా బ్యాటరీ అయిపోతే, ఏదైనా సమస్య వస్తే కూడా అందుబాటులోని పెట్రోల్ బంకుకు వెళ్లి ఫోన్ కాల్ చేయవచ్చు.
వాష్ రూమ్స్ :
Petrol Bunk Services : పెట్రోల్ బంకుల్లో వాష్ రూమ్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ట్రావెల్ చేసే,సమయంలో మహిళలు, చిన్నపిల్లలు బయటకు వెళ్లేందుకు ఇవి అందుబాటులో ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. హైజెనిక్ టాయిలెట్స్, మరుగుదొడ్లు పెట్రోల్ బంకుల్లో తప్పనిసరి. దీనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు Customer కాకపోయినప్పటికీ,అంటే ఆ సమయంలో మీరు పెట్రోల్, డీజిల్ కొనకపోయినప్పటికీ,కూడా టాయిలెట్స్ ఉపయోగించవచ్చు.
తాగునీరు :
పెట్రోల్ బంకుల్లో పరిశుభ్రమైన తాగునీరు తప్పనిసరి. దాహం వేసినప్పుడు మంచి నీరు మీరు అక్కడ తాగవచ్చు లేకుంటే, బాటిల్స్‌లో కూడా తీసుకు వెళ్లవచ్చు.
ఫ్రీ ఎయిర్ :
పెట్రోల్ బంకుల్లో మీరు ఉచితంగా మీ వాహనాల్లో ఎయిర్ ని నింపించుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా మీరు మనీ చెల్లించి టైర్లలో గాలిని నింపించుకుంటే మీరు నష్టపోతున్నట్లే. ఎందుకంటే ఉచితంగా ఫ్రీ ఎయిర్. గాలిని నింపినప్పుడు వారు డబ్బులు తీసుకుంటే , మీరు వారి పైన ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని :
Petrol Bunk Services : మీరు Petrol, Diesel కొనుగోలు చేసిన తర్వాత పెట్రోల్ బంక్ లలో బిల్లును కచ్చితంగా అడిగి తీసుకోవచ్చు. సలహా/ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి. Working Hours మరియు Holidays పట్టికను వినియోగదారులకు తెలియజేసేలా Board ఏర్పాటు చేయాలి. Toilets ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.Dealer మరియు Oil కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు Security tools తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
పెట్రోల్ పంప్‌ను శుభ్రంగా ఉంచాలి. 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి. వాష్ రూమ్స్ తలుపులకు తప్పనిసరిగా గొళ్ళెం కలిగి ఉండాలి. ఈ-సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్ Owner ఈ నిబంధనలను పాటించకపోతే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. మొదటి ఉల్లంఘన కింద పదిహేను రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. రెండో నిబంధన కింద పెట్రోలు బంకును ముప్పై రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. మూడోసారి నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ పంపు డీలర్ షిప్‌ను తొలగించవచ్చు.