Government Schemes for Women : మహిళల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టుమిషన్ పథకం.
Government Schemes for Women : మహిళల స్వంత లాభాల కోసం ప్రభుత్వాలు అనేకమైన పథకాలను ప్రారంభించాయి.వాటిల్లో ముఖ్యమైన పథకాలలో ఉచిత కుట్టు మిషన్ పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద దాదాపు యాభై వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ఎలా పొందాలనే దాని గురించి పూర్తి సమాచారం, వయోపరిమితి అవసరమైన పత్రాల గురించి ఇక్కడ ఉన్నాయి.
పేద మహిళలు స్వావలంబనతో పాటు ఆర్థికంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలోని పేద కుటుంబాలకు చెందిన మహిళల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత కుట్టు కుట్టుమిషన్ పథకం.
Government Schemes for Women ఈ పథకం పేద మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం మరియు ఆర్థికంగా వారికి సహాయం అందించడం ద్వారా వారు స్వావలంబనతో జీవించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ పథకం కింద సుమారు 50 వేల మంది మహిళలు ఉచితంగా కుట్టు మిషన్ పొందగలరు.ఈ పథకం యొక్క ప్రయోజనం ఎలా పొందాలి, వయోపరిమితి మరియు అవసరమైన పత్రాలు, పూర్తి సమాచారం గురించి ఇక్కడ చూద్దాం.
Government Schemes for Women పేద, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను స్వావలంబన చేసి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా మహిళలు టైలరింగ్ చేసుకుంటూ,ఇంటి నుండే డబ్బు సంపాదించవచ్చు. ఈ పథకం కింద ఉచితంగా కుట్టుమిషన్లు పొందడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా లాభాలను పొందవచ్చు.
ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి అర్హత వివరాలు :
- వయస్సు : దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆదాయము : దరఖాస్తుదారు మహిళ కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు : వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే, అలాంటి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
- భారత పౌరసత్వం : భారతీయ మహిళలు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు.
ఎలా దరఖాస్తు చేయాలి:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ:
- ముందుగా, పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- వెబ్సైట్లో ఒకసారి, ఉచిత కుట్టు యంత్రం పథకం 2024 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- ఆ దరఖాస్తు ఫారమ్‌ను కావాల్సిన పత్రాలతో కలిపి సరిగ్గా నింపి, దరఖాస్తును సమర్పించండి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ :
Online లో దరఖాస్తు చేసుకోలేని మహిళలు తమ సమీపంలోని మహిళా సాధికారత కేంద్రం లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా Offline లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్కడ దరఖాస్తు ఫారమ్‌ను తీసుకొని , దానిని నింపి అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డ్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- నివాస ధృవీకరణ లేఖ.