Thoranam in Telugu : పండుగలకు,శుభకార్యాలకు అసలు గుమ్మాలకి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

Thoranam in Telugu : పండుగలకు,శుభకార్యాలకు అసలు గుమ్మాలకి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

Thoranam in Telugu : పండుగలప్పుడు ఖచ్చితంగా ఇంటికి మామిడి తోరణాలను కడుతుంటాం. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. కానీ ఈ తోరణాలు కట్టడానికి కారణాలేంటో మీకు తెలుసా?

Thoranam in Telugu : ప్రతి ఇంట్లో ఎటువంటి శుభకార్యం చేసినా, ఎటువంటి పండుగలొచ్చినా సరే,ఇంట్లోని ప్రతి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలను కడుతాం. ఇది ఇప్పుడిప్పుడు పాటిస్తున్న ఆచారం కాదు. ఎన్నో ఏండ్ల నుంచి ఇది కొనసాగుతూ వస్తోంది. ఈ తోరణాలు మన ఇంటిని అందంగా మార్చేస్తాయి. అందుకే కడతారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ తోరణాలతో మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని మన పెద్దలు నమ్ముతారు.

శుభకరమైన సమయాల్లో, పండగ పూట ఈ మామిడి తోరణాలను గుమ్మాలకు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న Bad Energy బయటకు పోతాయని నమ్ముతారు. అలాగే దేవాలయాల ఉత్సవాల్లో కూడా తోరణాలను ఖచ్చితంగా కడతారు. ఇవి శుభప్రదమైన రూపాన్ని కలిగిస్తాయని పండితులు చెప్తారు.

ఈ మామిడి తోరణాలను తయారుచేయడానికి పెద్ద కష్టమేమి కాదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వీటిని దీపావళి, సంక్రాంతి వంటి పండగలతో పాటు, పెళ్లి వంటి శుభకార్యాల్లో ఖచ్చితంగా కట్టాలని చెప్తారు. అసలు ఇంటి గుమ్మాలకు తోరణాలను ఎందుకు కడతారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

మనకు తెలియని ఎన్నో విషయాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఈ తోరణాలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదని పండితులు చెప్తుంటారు. వీటికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పవర్ కూడా ఉంటుంది. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తున్న చాలా ఆచారాలు శాస్త్రీయంగా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిరూపించబడ్డాయి.

మీకు ఎవరికైనా తెలుసా? ఒకప్పుడు శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చే ఆచారమే లేదు. ఎవరి ఇంట్లోనైనా ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే దానికి గుర్తుగా ఇంటి గుమ్మానికి ఈ మామిడి తోరణాలను కట్టేవారు.అలా గుమ్మాలకి కట్టిన తోరణాలను చూసి వీళ్లు ఏదో శుభకార్యం చేస్తున్నారని ఇరుగుపొరుగువారు అర్థం చేసుకునేవారట.ఒకవేళ తోరణం కట్టకపోయినా,ఇంటి వాకిట్లో మామిడి ఆకులు, వేప ఆకులతో కలిపి పందిరి వేసేవారట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Mamidi Thoranam : మామిడి తోరణాలను హిందూ మతంలో శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఇప్పటికీ కూడా అన్ని రకాల పండుగలకు,శుభకార్యాలకు గుమ్మాలకి మామిడి తోరణాలను కడతారు. ముఖ్యంగా శుభ దినాల్లో ఇంటి ప్రధాన గుమ్మాలకి, గేటుకు ఈ మామిడి తోరణాన్ని ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే ఇలా కట్టడం వల్ల నెగిటివ్ Energy ట్లోకి రావని నమ్మిక.

Thoranam in Telugu : మామిడి తోరణాలను కట్టడానికి ఒక పద్దతి ఉంటుంది. మొదట పసుపు రాసిన దారానికి మామిడి ఆకులను తీసుకొని తోరణంగా కట్టుకోవాలి. అలాగే ఈ మామిడి ఆకులకు పసుపును రాసి, వాటికి కుంకుమ బొట్టు పెట్టాలి. వీటిని నీడలో ఉంచి,ఇంటి వాకిట్లో కట్టాలని చెప్తారు. అంతేకానీ మామిడి తోరణాన్ని అలాగే కట్టకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

Thoranam in Telugu : మామిడి తోరణంలో 11 మామిడి ఆకులను, ఇంతకంటే ఎక్కువైతే 21 లేదా 101 ఆకులతో తోరణాన్ని ఏర్పాటు చేసుకొని కట్టాలి. పండగలప్పుడు ఒక మామిడి తోరణంమే కాకుండా,వాటితో పటు వేప ఆకులను కూడా కడతారు. ఈ మామిడి ఆకులు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ ఆకులు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. మనం పీల్చే ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఈ మామిడి తోరణాలు ఇంట్లో, ఉండేటువంటి చెడు శక్తులను తొలగిస్తాయి. ఇంటికి మంచిచేస్తాయని నమ్ముతారు.

Thoranam in Telugu : మామిడి ఆకులకు, వేప ఆకులను మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మామిడి ఆకుల్లో ఆదిశక్తి ఉంటే. వేప ఆకుల్లో మహాలక్ష్మి ఉంటారని నమ్ముతారు. మామిడి తోరణాలు మన మనసులో మంచి ఆలోచనలను కలిగిస్తాయి. అలాగే గాలిలోని Carbon dioxide ను పీల్చుకుంటాయి. ఇకపోతే వేప ఆకులు గాల్లోని విష పదార్థాలను పీల్చుకుంటాయి. ఇవి రెండు ఆకులు ఎండిపోతాయి .కానీ కుళ్లిపోవు. అందుకే వీటిని తోరణాలుగా వాడతారు.

Vepa Thoranam : వేప తోరణాన్ని పసుపు పూసిన దారంతో తయారుచేస్తారు. ఇలాంటి తోరణాలను ఎక్కువగా అమ్మవారి జాతర్లలో వాడతారు. అలాగే జాతరలప్పుడు కూడా వీధుల్లో అమ్మవారి గుడులలో ఇలాంటి తోరణాలను కడతారు. ఈ పచ్చని తోరణాలు వీధులను అందంగా మార్చేస్తాయి.

Thoranam in Telugu : వేప తోరణాలను జాతరలో కట్టడం ఒక భాగం. అలాగే ఇంట్లో ఎవరికైనా తట్టు పోస్తే, కూడా వేప ఆకుల తోరణాన్ని కడతారు. ఎందుకంటే ఈ వేప ఆకులు సాధారణంగా Disinfectant గా పనిచేస్తాయి. మశూచిని నయం చేయడంలో వేప ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే దీన్ని గ్రామాల్లో ఇప్పటికీ నమ్ముతారు.

Pula Thoranam : మామిడి, వేప తోరణాలతో పాటుగా అలంకరణ కోసం దేవాలయాల్లో, ఇంటి గుమ్మాలకి పూల తోరణాలను కడతారు. బంతి,చామంతి, గులాబీ, మల్లె వంటి అందమైన, మంచి వాసన వచ్చే పూలతో ఈ పూల తోరణాలను తయారుచేస్తారు. పిల్లల పుట్టినరోజు వేడుకల్లో, ఆడపిల్లల శుభకార్యాల్లో మరియు వివాహాల శుభకార్యాలలో ఈ పువ్వుల తోరణాలను ఎక్కువగా కడతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top