Fever Meaning in Telugu : జ్వరం ఎందుకు వస్తుంది? ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?

Fever Meaning in Telugu : జ్వరం ఎందుకు వస్తుంది? ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?

Fever Meaning in Telugu : సాధారణంగా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం వస్తుంది? జ్వరం వస్తే, బాడీ టెంపరేచర్ ఎంత ఉందో ప్రతి పూటా చెక్ చేసుకునేవాళ్లను చూస్తుంటాం.అయితే, మానవ శరీర సాధారణ Temperature ఎంత, ఎంత Temperature దాటితే జ్వరం అనాలి?శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ మన మెదడులోని హైపోతలామస్ లో ఉంటుంది.


మన చర్మంపై,Blood Temperature ను బట్టి వివిధ రకాలుగా మన శరీరాన్ని Normal Temperature లో ఉంచడానికి అది సహాయ పడుతుంది.చలి అధికంగా ఉన్నపుడు Temperature ను పెంచడానికి వణకడం లాంటిది, అలాగే Temperature ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించడానికి చెమటలు పట్టడం బాడీలో జరిగే రక్షణ ప్రక్రియలు.

Fever Meaning in Telugu ఎవ్వరికైనా ఉష్ణోగ్రత 98.6°F కంటే,అధికంగా ఉంటే, Fever అని, చాలా మంది అనుకుంటారు. కానీ , వాస్తవానికి అది అంత తేలిక కాదు.Body temperature అనేది ఆ వ్యక్తి Age , Gender, రోజువారీ జీవితం, కొలిచిన ప్రాంతం , కొలిచిన టైం, Weather/ Season వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.

మన శరీర ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉండేది మార్నింగ్ 6 గంటలకు. చాలా ఎక్కువగా ఉండేది , ఈవినింగ్ 4 నుంచి 6 గంటల మధ్య.అందుకే మార్నింగ్ టైంలో 98.9°F కన్నా అధికంగా ఉంటే, సాయంత్రం 99.9°F కన్నా ఎక్కువగా ఉంటే , మాత్రమే Fever అని అనాలి.

Fever Meaning in Telugu మహిళల్లో రుతు క్రమాన్ని బట్టి కూడా శరీర ఉష్ణోగ్రత మారుతుంది.నెలసరి మొదలయిన మొదటి రెండు వారాల కన్నా, రుతుక్రమం రావడానికి ముందు ఉండే, 2 వారాలలో శరీర ఉష్ణోగ్రత 0.9°F అధికంగా ఉంటుంది.అయితే ‘లో జ్వరం’ అనే ఒక పదం కూడా తరుచూ అంటూ ఉంటారు.

నిజానికి అలాంటిది ఏమీ ఉండదు. నోటి దగ్గర చిన్న చిన్న కురుపులు రావడం, అనేది ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కలిగే , ఒక వైరల్ ఇన్ఫెక్షన్.నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒకవేళ ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు, ఆ అనారోగ్య స్థితిని ‘లో జ్వరంగా’ చెప్తుంటారు.

ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు తిని, ఇమ్మ్యూనిటీ పవర్ని పెంచుకుంటే సరి, అది తగ్గిపోతుంది.వృద్ధుల్లో శరీర Temperature తక్కువగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగినప్పటికీ ఎక్కువగా పెరగకపోవచ్చు. అందుకే వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగినా, అలెర్ట్ గా ఉండడం చాలా అవసరం.

Fever Meaning in Telugu చిన్న పిల్లల్లో, ముఖ్యంగా 5 నెలల నుండి, 5 సంవత్సరాల వయసు వారికి జ్వరం ఎక్కువగా వస్తుంది. దాన్ని వెంటనే కంట్రోల్ చేయకపోతే, మూర్ఛ (fits) వచ్చే ప్రమాదం ఉంది.Temperature ఎక్కడ చూస్తున్నాం అనేది కూడా ముఖ్యం. నోట్లో thermometer పెట్టి చూస్తే,Temperature average 98.6° F ఉంటుంది. కొంతమంది పిల్లలు నోటితో ఊపిరి తీసుకునే , వారికి అది ఇంకా తక్కువగా ఉండవచ్చు.సాధారణంగా పిల్లల శరీర Temperature కొలిచేటప్పుడు మల ద్వారం వద్ద (rectal temperature)మరియు చెవి (tympanic) దగ్గర చూసే, ఉష్ణోగ్రత 0.5°-1°F అధికంగా ఉంటుంది. చేతుల కింద (axillary) చూస్తే 97.7°F ఉంటుంది.

  • వైరల్ ఇన్ఫెక్షన్లు
  • బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు
  • మలేరియా లాంటి వ్యాధులు
  • స్వయం ప్రతిరక్షక వ్యాధులు
  • కొన్ని రకాల Medications (ముఖ్యంగా కొన్ని యాంటీ బయాటిక్లు, మానసిక రుగ్మతలకు వాడేవి)
  • టీకాలు (పిల్లలకు ఇచ్చే డీపీటీ నుంచి కోవిడ్ వరకు)
  • శరీరంలో ఎక్కడైనా ఉన్న క్యాన్సర్
  • హార్మోన్లు (థైరాయిడ్, కార్టిసోన్, ప్రాజెస్టరోన్)
  • ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల
    ఏదైనా రీజన్ తో జ్వరం వస్తే, వీలైనంత తొందరగా దాన్నితగ్గించడం చాలా అవసరం. లేదంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి (dehydration) , నీరసంగా అవుతారు.

ఎన్ని గంటలు అధిక temperature తో ఉంటారో, అంతకు రెట్టింపు టైం కోలుకోవడానికి పడుతుంది. ఎక్కువగా పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.Fever ఉన్నప్పుడు వాటర్ మరియు ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.గోరు వెచ్చని వాటర్ తో ఒళ్ళంతా తుడుస్తూ ఉంటే, temperature కంట్రోల్ కి వస్తుంది. చల్లటి నీటితో తుడిస్తే , వణుకు వచ్చే Danger ఉంది.శరీరమంతా ఒకేసారి కాకుండా ఒక సారి చేతులు, కాళ్లు తుడిచి, కొంత సమయం తరవాత శరీరాన్ని మొత్తంగా తుడిస్తే మంచిది.

Fever Meaning in Telugu జ్వరానికి మందు పారాసెటమాల్. ఆ Medicine తో Fever అదుపు కాకుండా Patient నీరసించడం, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వంటివి జరిగినా, 2 రోజులైనా జ్వరం తగ్గకపోతే ,తప్పకుండా డాక్టర్లను కలవాలి.అంతేకానీ, Fever వచ్చిన మొదటి రోజే ,టెస్ట్ లు చేయడం వల్ల ఒక్కోసారి అందులో ఏమీ తెలియక పోవచ్చు.రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చికిత్స ఆలస్యం చేయొచ్చు. అలాగే అనవసరంగా యాంటీ బయాటిక్లు వాడడం వల్ల బాడీ మరింత నీరసంగా మారొచ్చు.

జ్వరంతో కోల్డ్ , గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలకు 80-85% Reason వైరల్ వ్యాధులు. అలాగే నీళ్ల విరేచనాలకు 75-80% కారణం వైరల్ ఇన్ఫెక్షన్. Bacteria వల్ల కలిగే కొన్ని న్ఫెక్షన్లలోనూ అనేక సార్లు, అవి వాటంతట అవే తగ్గిపోయేవి కూడా ఉంటాయి. అంటే లక్షణాలకు తగిన చికిత్స ఇస్తే, అవే తగ్గిపోతాయి. అంతే కానీ, వైరస్‌ పై Antibiotics అయితే పని చేయవు. కాబట్టి అవసరం లేకున్నా, యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల వాటి దుష్ప్రభావాలతో ఆకలి తగ్గి, నిద్ర పట్టక కూడా మరింత నీరసిస్తారు.

Fever Meaning in Telugu సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు Serious లక్షణాలతో ఉంటాయి, కానీ ఒక Week లోపు తగ్గిపోతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తక్కువ తీవ్రతతో మొదలై క్రమేణా పెరుగుతూ, ఎక్కువ డేస్ ఉంటాయి. చలి జ్వరం అనేది మూత్రంలో ఇన్ఫెక్షన్, Malaria, నిమోనియా, ఎక్కడైనా చీము పట్టడం వల్ల కూడా వస్తుంది.జ్వరం ఒక లక్షణం. దాన్ని తడి గుడ్డ పెట్టడం, వాటర్ బాగా తాగడం, పారాసెట్మాల్ వేసుకోవడంతో నియంత్రించుకోవచ్చు.ఆ లక్షణానికి కారణం ఏంటో తెలుసుకొని, దానికి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

గమనిక : ఆరోగ్య సమస్యలపై స్థూలమైన అవగాహన కోసమే ఈ వ్యాసం.దీనికి todayintelugu.com ఎటువంటి భాద్యత వహించదు. నిర్దిష్టమైన చికిత్స కోసం నేరుగా వైద్యులను సంప్రదించాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top