Guntagalagara Aaku Uses in Telugu : దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకుంటే మాత్రం పొరబడినట్లే, ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ మూలిక.Bhringraj in Telugu.

Guntagalagara Aaku Uses in Telugu : దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకుంటే మాత్రం పొరబడినట్లే, ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ మూలిక.Bhringraj in Telugu.

Guntagalagara Aaku Uses in Telugu ప్రకృతి ప్రసాదించిన అద్భుత మూలికలలో ఈ మొక్క కూడా ఒకటి. మన ఆరోగ్యానికి సంజీవని అని కూడా చెప్పవచ్చు. దీనినే భృంగరాజ్ అని కూడా పిలుస్తారు. పెద్దలకు ఈ ఆకు అంటే,ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. గుంటగలగర మొక్క. పంట కాలువలు, గుంటల పక్కన మరియు వరి పొలాల గట్లపై పెరిగే ఈ చిన్న మొక్క తెల్లని పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Guntagalagara Aaku Uses in Telugu ప్రాచీన భారతీయులకు అందాన్ని ఆరోగ్యముతో పాటు ఆయుష్యు ను కూడా అందించిన అమృత ఔషథంగా చెప్పవచ్చు. గుంటగలగర ఆకు ఆకలి కోల్పోయిన వారికి ఇది అమృతం వంటిది. ఇది మందగించిన కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది.

Bhringraj in Telugu ఊడిపోయిన, నెరసిన మరియు పలుచగా మారిన తలజుట్టును తిరిగి నల్లగా దృఢంగా వచ్చేలా చేస్తుంది. ఇది నాశికలో శ్వాసకు అడ్డుపడే బాడ్ కఫాన్ని,నాశికలో పెరిగే కొయ్య కండరాలను కరిగిస్తుంది. ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం, ప్లీహం వంటి అవయవాలకు ప్రాణం పోసి, రక్తాన్ని ఫిల్టర్ చేసి, వృద్ధి చేస్తుంది. అంతేకాదు చర్మంపై మచ్చలు, ముడతలు పోగొడుతుంది. దీన్ని ఒక సంవత్సరంపాటు వాడటం వల్ల సర్వవ్యాధులను నివారిస్తుంది.

Bhringraj in Telugu ఈ భృంగరాజ్ మొక్కలు నీటి కాలువ ఒడ్డున, వరి పొలాల గట్లపైన ఎక్కడపడితే అక్కడ వర్షా కాలంలో చాలా విరివిగా పెరుగుతాయి. భూమిపైన ఒకటి నుండి రెండడుగుల ఎత్తు వరకు పెరుగుతూ వీటి కాండం, కొమ్మలపైన తెల్లని నూగు ఉండి , తెల్లటి పూలు పూస్తాయి.

Guntagalagara Aaku Uses in Telugu ఇది కారము, చేదు రుచులతో, ఉష్ణ స్వభావంతో రసాయనసిద్ధిని కలిగించే అమృతగుణం కలిగి ఉండటంవల్ల అన్నిరకాల కఫ, వాత రోగాలను నివారిస్తుంది.

➨ గుంటగలగర ఆకులను కొద్ధిగా నీటితో కలిపి మెత్తగా పేస్ట్ లాగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇదే రసాన్ని ఫిల్టర్ చేసి , ఈ రసాన్ని ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలికంగా ఉండే, తలనొప్పి, తలబరువు, మెదడు బలహీనత, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు కూడా నివారించబడతాయి.

➨ గుంటగలగర ఆకుల యొక్క రసంను మరియు నువ్వులనూనె సమపాళ్ళలో కలిపి ఒక పాత్రలో పోసి, చిన్న మంటపైన రసమంతా ఇంకిపోయి, నూనె మిగిలే వరకూ మరిగించాలి. ఆ తర్వాత దించేసి, చల్లారాక వడపోయాలి. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న నూనెను రోజూ 2 పూటలా రెండు ముక్కులలో 5 చుక్కల మోతాదుగా వేసి, పీలుస్తుంటే , నాశికా వ్యాధులు తగ్గడమేగాక దృష్టి, జుట్టు కూడా పెరుగుతాయి.

➨ గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి, నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకొని ఐదు నుండి పదినిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత, నాలుకపూత, నాలుకపై పగుళ్ళు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి.

Guntagalagara Aaku Uses in Telugu వయసును బట్టి 5 నుండి 10 గ్రాములు ఆకుల్ని తీసుకొని, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరిన పేస్టును అరకప్పు నీటిలో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని వడబోసితే, వచ్చిన రసాన్ని ఉదయం, సాయంత్రం 2 పూటలా భోజనానికి ఒక గంట ముందు తీసుకుంటే,కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

Bhringraj in Telugu ఈ ఆకులను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు మరియు దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా పూయాలి. పూసిన ఒక గంట తరువాత స్నానం చేస్త, క్రమంగా ఇవి సమసిపోతాయి. లేదా గుంటగలగర వేళ్లు, వేళ్ళ పొడి, ఇంట్లో తయారుచేసుకున్న పసుపుకొమ్ముల పొడిని ఈ రెండింటిని సమ పాళ్లల్లో కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటే కూడా చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి.

Guntagalagara Aaku Uses in Telugu మట్టి మూకుడులో శుభ్రంచేసినటువంటి వామును వేసి , అది మునిగే వరకూ ఈ గుంటగలగర ఆకుల రసంను పోసి, రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఆ పాత్రను ఎండలో పెట్టి, దానిని మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే, సాయంత్రానికి రసమంతా గింజలలోకి ఇంకి పోతుంది. దీన్ని బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఆ గింజల్ని పౌడర్ చేసి, జల్లెడపట్టి నిల్వ చేసుకోవాలి.

Guntagalagara Aaku Uses in Telugu కప్పు మంచినీటిలో పావుచెంచా ఈ పొడిని వేసి, బాగా కలిపి 2 పూటలా భోజనానికి గంట ముందుగా తాగాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల పైథ్యం, ఉద్రేకం తగ్గుతాయి. అందుకు కారణమైన కాలేయము (లివర్‌) సహజస్థితికి చేరుతుంది. అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్ళు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదాలు పగలడం మొదలైన సమస్యలన్నీ తగ్గుతాయి.

వీటి ఆకులను, కొమ్మలను బాగా కడిగి, దంచితే వచ్చిన రసాన్ని వడపోసి రోజూ రెండుపూటలా భోజనానికి గంట ముందుగా పావుకప్పు చొప్పున తాగాలి. ఇలా రెగ్యులర్గా తప్పకుండా చేయడం వల్ల కాలేయ వాపు, ప్లీహ వాపు తగ్గి పోతాయి. దీనివల్ల రక్తం శుద్ధవుతుంది. వృద్ధి కూడా చెందుతుంది. చర్మ రోగాలు, మలబద్ధకం, నపుంసకత్వం మొదలైన వ్యాధులూ సమసిపోతాయి. కుష్టురోగం కూడా సంవత్సర కాలంలో పూర్తిగా తగ్గుతుంది. అయితే కుష్టు వ్యాధిగ్రస్తులు ఆవు పాలతో మాత్రమే తీసుకోవాలి.

పైన తెలిపినటువంటి విధంగా గుంటగలగర ఆకుల యొక్క రసం రెండుపూటలా మూడు, నాలుగు చుక్కల మోతాదులో ముక్కులలో వేసి పీలుస్తూ ఉంటే , ముక్కుల నుండి చెడిపోయిన కఫం నీటిలాగా కారిపోయి, శ్వాస క్రమబద్ధమై, శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

వీటి పచ్చి ఆకులను దంచి , తీసిన రసం బట్టలో ఫిల్టర్ చేసి, 1 లేక 2 చుక్కలు రెండుపూటలా కళ్ళల్లో వేస్తుంటే కండ్లకలకలు, దానివల్ల ఏర్పడిన మంటలు, నొప్పులు, ఎరుపుదనం రెండు, మూడు రోజుల్లో తగ్గుతాయి.

ఆకులను కొంచెం నీటితో కలిపి, దంచాలి. అలా వచ్చిన రసాన్ని వడపోయాలి. దీన్ని పావుకప్పు తీసుకొని అందులో 3 చిటికెలు ఉప్పు, దోరగా వేయించిన మిరియాల పొడి, 2 చెంచాల నిమ్మరసం కలిపి 2 పూటలా భోజనానికి గంట ముందు తాగితే రెండు, మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది.

గుంటగలగర మొక్కలను దంచి తీసిన రసం ఒక నూలుబట్టలో ఫిల్టర్ చేసి,దీనిని పావుకప్పు నుండి అరకప్పు మోతాదుగా తాగాలి. ఆ వెంటనే ఒక కప్పు ఆవు పాలల్లో చెంచా పటికబెల్లం పౌడర్ ని కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 40 రోజుల పాటు తీసుకుంటే, అనూహ్యమైన శారీరక బలం కలుగుతుంది.

ఎన్నో వ్యాధులను అతి సులువుగా నివారించ గల ఔషధశక్తి ఈ మొక్కల్లో ఉండటంవల్ల గుంట గలగర ఆకులతో పచ్చడి, పప్పు, వేపుడు, తాలింపుకూర మొదలైన వెరైటీలు కూడా తయారుచేసుకొని తింటారు.

గమనిక : ఈ పైన తెలిపిన సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహామేరకు తీసుకొని అందించడం జరిగింది.ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.పైన తెలిపిన సమాచారానికి Todayintelugu.com ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top